Homeటాప్‌స్టోరీరూ.1000 కోట్ల క్లబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: ఊహించినట్లుగానే ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుల సునామీని సృష్టిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, మళయాళీ, కన్నడతోపాటు హిందీభాషల్లో ఈ సినిమా రిలీజైన విషయం తెల్సిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలై రెండు వారాలు ముగిసింది. ఈ రెండు వారాల్లో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్‌ సాధించిన మూడవ భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్‌ ఇంకా కొనసాగుతూనే వుంటుంది. దర్శకుడు రాజమౌళీ అందించిన పాన్‌ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుల ప్రభంజనం సృష్టించడం సాధారణమైన విషయమని సినీ వ్యాఖ్యాతలు చెపుతున్నారు. తాజాగా రెండు వారాల వ్యవధిలో రూ.1000 (గ్రాస్‌) కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రేక్షకులను అలరించేందుకు తమ వంతు ప్రయత్నం చేశామని, అందుకు ప్రేక్షకులు తిరిగి వెలకట్టలేని ప్రేమను అందించారని ట్వీట్‌ చేసింది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా కథతో రూపొందిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు చేసిన మొదటి భారతీయ సినిమాగా ఇప్పటివరకు ‘దంగల్‌’ నిలవగా, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’లు ఉన్నాయి. అయితే ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్‌ సాధించిన సినిమాగా బాహుబలి 2 నిలిచింది. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రయత్నిస్తున్నది. ఏం జరుగుతుందో వేచిచూద్దాం! (Story: రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’)

See Also :

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details)

మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!