మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
అమరావతి : ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తు పెట్టుకుంటానని.. తనకు నాకు మీడియా చేసిన సహాయం అమోఘమని రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. మీడియా మిత్రులను పేరుపేరునా పిలిచి ఆశ్చర్యపరిచారు. మంత్రిగా చివరి రోజు కావడంతో గురువారం సాయంత్రం పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాతో గెట్ టుగెదర్ నిర్వహించారు. నిజానికి ఆయనను సీఎం జగన్ కొనసాగిస్తారని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే, జగన్ పై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఆయన ఎంతో చాకచక్యంగా సమాధానాలిస్తూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. మీడియా కూడా ఆయన పీఆర్‌కు నచ్చి పూర్తి సహకారం అందజేయడం విశేషం. గెట్ టుగెదర్‌లో ఒక దశలో ఆయన కంటతడి పెట్టినంత పనిచేశారు. ఉద్వేగంతో మాట్లాడారు. ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తు పెట్టుకుంటానని.. తనకు నాకు మీడియా చేసిన సహాయం అమోఘమని అభిప్రాయపడ్డారు. ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేఅంత దగ్గరయ్యారన్నారు. మంత్రి గా అవకాశం ఇచ్చిన జగన్ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని భావోద్వేగానికి గురయ్యారు.పేర్ని నాని ఇచ్చిన విందులో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పలు చానళ్లు, పత్రికలకు సంబంధించిన మీడియా ప్రతినిథులను పేర్ని నాని పేరుపేరునా పలకరించారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. తన మంత్రి పదవి గురించి ముందుగానే పేర్ని నాని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రవాణా శాఖకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. కొత్తమంత్రికి అన్ని విధాలుగా సహకరిస్తానని.. అవసరమైన సీఎంతో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో నాకైతే మంత్రి పదవి ఉండదని పేర్ని నాని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం చివరిసారిగా భేటీ అయింది. కేబినెట్‌లోకి కొత్తమంత్రులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సెక్రటేరియట్లోని మంత్రుల పేషీల్లో సందడి నెలకొంది. రాత్రి 9కల్లా రాజీనామాల ప్రక్రియ పూర్తయింది. (Story: మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు)
See Also: కొత్త ఆర్థిక మంత్రి అతనే!
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!