ఇండియన్ నేవిలో 2500 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియ మొదలైంది!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులకు నిజంగా ఇది తీపికబురే. నావికాదళ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
1. మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2500
2. ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2022 మార్చి 29
3. దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 05
4. ఇందులో ఆర్టిఫిషర్ అప్రెంటీస్ 500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ 2000 పోస్టులు వేకన్సీ ఉన్నాయి. ఈ కోర్సు బ్యాచ్ 2022 ఆగస్టులో ప్రారంభమవుతుంది.
5. విద్యార్హతకు సంబంధించి 60 శాతం మార్కులతో సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతసాధించి ఉండాలి.
6. నిర్దేశించిన శారీరక ప్రామాణాలు ఉండాలి.
7. వయోపరిమితికి సంబంధించి 2002 ఆగస్టు 1 నుంచి 2005 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
8. ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులని రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
9. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్ కాలంలో రూ.14,600 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక నెలకు రూ.21,700 నుంచి రూ.69100 వేతనం చెల్లిస్తారు.
10. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. (Story: ఇండియన్ నేవిలో 2500 ఉద్యోగాలు)
See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!