Home టాప్‌స్టోరీ తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

0
RRR Collectins
RRR Collectins

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) (రౌద్రం, రణం, రుధిరం) ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రికార్డు కలెక్షన్లతో భారతీయ సినీ పరిశ్రమ చరిత్రనే తిరగరాసింది. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్‌(Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ శుక్రవారం (2022 మార్చి 25) విడుదలైన విషయం తెల్సిందే. విడుదలైన నాటి నుంచే సినిమా సూపర్‌టాక్‌ను సొంతం చేసుకుంది. పైగా వారం రోజుల వరకూ దేశంలోని అన్ని ధియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టిక్కెట్లు అయిపోయాయి. దీంతో రాజమౌళి గత చిత్రం ‘బాహుబలి’ రికార్డులను ఈ చిత్రం తొలి రోజే అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో సుమారు 11 వేల థియేటర్లలో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తొలిరోజు రూ.257 కోట్ల గ్రాస్‌ సాధించిందని సినీ ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రూ.120 కోట్లు వసూలు చేయగా.. రూ.74కోట్ల షేర్‌ వచ్చిందని చెపుతున్నారు. కర్ణాటకలో రూ.16కోట్లు, తమిళనాడులో రూ.12కోట్లు, కేరళలో రూ.4కోట్లు సాధించగా, ఉత్తరాదిలో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇవిగాకుండా, ఓవర్సీస్‌లో రూ.78 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు సృష్టించింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.43 కోట్ల షేర్‌ సాధించిన ‘బాహుబలి-2’ రికార్డు నెలకొల్పగా… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆ మొత్తాన్ని అధిగమించి రూ.74 కోట్ల 11 లక్షలతో రికార్డు నమోదు చేసింది. అయితే హిందీలో తొలిరోజు వసూళ్లపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. గతంలో ‘సాహో’ అక్కడ రూ.24 కోట్లు వసూళ్లు సాధించగా… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.19 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని ట్రేడిరగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు బాహుబలి సాధించిన రూ.217 కోట్ల గ్రాస్‌ను అధిగమించిన ఆర్‌ఆర్‌ఆర్‌…రూ.257 కోట్లతో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించడం విశేషం. వచ్చే వారం రోజుల్లోనే బాలీవుడ్‌లో సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డుల సునామీ సృష్టించడం ఖాయమని ఆ వర్గాలు చెపుతున్నాయి. తెలుగు సినిమా సత్తాను చాటిన రాజమౌళి దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగేళ్లు ఎంతో శ్రమించి తీసిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఆలియాభట్‌ హీరోయిన్‌గా నటించింది. అజయ్‌దేవ్‌గణ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. నటులంతా మెప్పించగా, డిజిటల్‌ మాయతో సినిమాను ఒక గొప్ప వండర్‌గా తీర్చిదిద్దారు. (Story: తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!)

See Also: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version