వృద్ధులకు నిత్యవసర వస్తువులు అందజేత
న్యూస్ తెలుగు/వినుకొండ : క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నిర్మలా బాలికల హై స్కూల్ విద్యార్థినిలు వెల్లటూరు రోడ్డు లోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారికి నిత్యవసర వస్తువులు, బియ్యం, తినుబండారాలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం నిర్మల బాలికల హై స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ సాటి మానవుల పట్ల ప్రేమ ఆదరణ కలిగి ఉండాలని పెద్దలను గౌరవించాలని వృద్ధులకు సేవలు అందించాలని అన్నారు. మానవసేవే మాధవసేవ అనే బాటలో నడుస్తున్న గుమ్మడి వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వరరావు దంపతులను అభినందించారు. ఆ యేసు క్రీస్తు ప్రభువు వారికి మరింతగా శక్తిని మనోబలాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని లు మరియు సిస్టర్స్ పాల్గొన్నారు.(Story : వృద్ధులకు నిత్యవసర వస్తువులు అందజేత )