Home వార్తలు ఆర్‌ఆర్‌ఆర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ఏమన్నారంటే…!

ఆర్‌ఆర్‌ఆర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ఏమన్నారంటే…!

0
RGV on RRR
RRR

ఆర్‌ఆర్‌ఆర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ఏమన్నారంటే…!

30 ఏళ్లలో ఇలాంటి గొప్ప సినిమా నేను చూడలేదు
అద్భుతమైన సినిమా…రాజమౌళి గొప్ప డైరెక్టర్‌ : ఆర్జీవీ

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ దర్శకుడు, విమర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం, రణం, రుధిరం) సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. సినిమా ఒక అద్భుతమని, దర్శకుడు రాజమౌళి ఒక గొప్ప డైరెక్టర్‌ అని అభినందించారు. ఇలాంటి సినిమాను గడిచిన 30 ఏళ్లలో ఏనాడూ చూడలేదని చెప్పారు. ఈ మూవీని వర్ణించడానికి, జీవితంలో మొదటిసారి మాటలు కరవయ్యాయని అన్నారు. ఆర్జీవీ ఏమన్నారంటే…‘’ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమా నాలో చిన్నపిల్లాడిని బయటపెట్టింది. ఫేమస్‌, స్టేటస్‌… ఇలా అన్నీ మర్చిపోయి ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశా. ట్రైలర్‌ చూసినప్పుడు సినిమా బాగుంటుందని భావించాను. కానీ, సినిమా చూశాక తెలిసింది ఇదొక అద్భుతమైన చిత్రం. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మాటలు కరవయ్యాయి. నేను దేని గురించి మాట్లాడినా ఫుల్‌ క్లారిటీగా ఉంటాను. కానీ జీవితంలో మొదటిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కథేంటి? పాత్రలు ఎవరు? అనే విషయాన్ని పక్కనపెడితే కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది’’ అని అన్నారు. ‘‘చరణ్‌ పాత్ర బాగుందని కొందరంటారు. తారక్‌ పాత్ర చాలా బాగుందని ఇంకొందరు అంటారు. నిజానికి ఆ రెండూ ట్రాష్‌. అనవసరమైన మాటలు. ఎందుకంటే, ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టేశారు. గడిచిన 30 ఏళ్లలో ఇంతలా ఏ చిత్రాన్ని నేను ఎంజాయ్‌ చేయలేదు. రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం. ప్రేక్షకుల కోసమే పుట్టావు. నీలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి.. సినిమానే కలగా చేసుకుని.. దర్శకుడిగా మంచి చిత్రాలు తెరకెక్కిస్తున్నందుకు సినీ ప్రియులందరూ ఎంతో ఆనందిస్తున్నారు’’ అని రామ్‌ గోపాల్‌ వర్మ తెలిపారు. (Story: ఆర్‌ఆర్‌ఆర్‌పై రామ్‌గోపాల్‌ వర్మ ఏమన్నారంటే…!)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version