Home వార్తలు విడుదలకు ముందే తెలుగులో కేజీఎఫ్‌2 రికార్డ్‌!

విడుదలకు ముందే తెలుగులో కేజీఎఫ్‌2 రికార్డ్‌!

0
KGF 2
KGF 2

విడుదలకు ముందే తెలుగులో కేజీఎఫ్‌2 రికార్డ్‌!

హైదరాబాద్‌: కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 మూవీ మరిన్ని సంచలనాలు సృష్టించబోతున్నది. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్‌ (ఛాప్టర్‌ 1) సినిమా భారీ హిట్‌ కొట్టింది. ఆ తర్వాత తెలుగులో విడుదలై అంతకన్నా పెద్ద హిట్‌ను సాధించింది. ఈ సినిమా కన్నడ రికార్డులను తిరగరాయగా, తెలుగులో పెద్ద రికార్డులు లేకపోయినా మెగాహిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అన్ని తిరగరాసింది.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ సినిమా కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా రాబోతున్న కేజీఎఫ్‌ 2 కూడా అదే రేంజిలో హిట్‌ కొట్టడానికి సిద్ధం కాబోతున్నది. 2021లోనే కెజిఎఫ్‌ పార్ట్‌ 2 రిలీజ్‌ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడిరది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 14 రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఇప్పుడు ఆకాశానికి తాకింది.. ఈ లెక్కలు చూసి అందరు షాక్‌ అవుతున్నారు.నిర్మాతలు చెబుతున్న రేట్స్‌ విన్న బయ్యర్స్‌ కళ్ళు తేలేస్తున్నారట.. కొద్దిగా ఎక్కువుగానే వీరు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఈ సినిమా తెలుగులో భారీ రేట్‌ చెప్పారట.. 70 కోట్ల మేరకు చెప్పిన దిల్‌ రాజు అంత పెద్ద మొత్తం అంటే ఎక్కువ అని అనుకున్నారు.. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాలతో ఈ సినిమాకు 66 కోట్లకు దిల్‌ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడు.. తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది అలాంటిది రెండవ భాగం ఏకంగా 240 కోట్ల మేరకు అమ్ముడైంది.. కన్నడలో 100 కోట్ల సోలో బిజినెస్‌ జరుగుతుంది. తమిళంలో 30 కోట్ల వరకు బిజినెస్‌ చేయగా.. ఓవర్సీస్‌ లో 80 కోట్ల వరకు కోట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఎలా చూసుకున్న కూడా అన్ని భాషల్లో కలిసి కేజీఎఫ్‌ ఏకంగా 20 కోట్లు ప్ర రిలీజ్‌ బిజినెస్‌ చేసిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.. మరి ఈ సినిమా ఎంత రాబడుతుందో చూద్దాం.. మరి ఇంత వసూలు చేయాలంటే సినిమా 300 గ్రాస్‌ షేర్‌ వసూలు చేయాల్సిందే అని లెక్కలు చెబుతున్నాయి.. కేజీఎఫ్‌ సినిమాలో యష్‌ హీరోగా నటించాడు. ఈ ఒక్క సినిమాతో అతను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. రాఖీభాయ్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. మళ్లీ అదే స్టఫ్‌తో తెలుగులోనూ జెండా ఊపనున్నాడు. (Story: విడుదలకు ముందే తెలుగులో కేజీఎఫ్‌2 రికార్డ్‌!)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version