బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలను వేరు,వేరు గ్రామ పంచాయితీలుగా కొనసాగించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : 30ఏండ్లుగా పోరాటం చేసి గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కలను నిరంజన్ రెడ్డి నెరవేర్చి బలిజేపల్లి, జంగమాయపల్లి గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతిలుగా చేశారని, వేరు వేరు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు అయిన తర్వాత గ్రామాలు శరవేగంతో అభివృద్ధి చెందాయని రెండు గ్రామాల ప్రజలం ఐకమత్యంతో మెలుగుతున్నామని ఆటువంటి మామధ్య మనస్పర్థలు,విబేధాలు సృష్టించి మళ్ళీ రెండు గ్రామాలను కలిపి ఉమ్మడి గ్రామ పంచాయితీగా చేసి లబ్ధిపొందాలని స్థానిక ఎం.ఎల్. ఎ మేఘారెడ్డి,మాజీ Z.P.T.C రమేష్ గౌడ్ కుట్ర పన్నుతున్నారని విట్ట.నరసింహ రెడ్డి (రైతు బంధు అధ్యక్షులు),గట్టు.నగేష్(మాజీ ఉప సర్పంచ్), విట్టా.సంజీవ్ రెడ్డి(గ్రామ అధ్యక్షులు),కుమ్మరి.బాలస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా అధికారం ఉంది కదా అని తమ రాజకీయ లబ్ధికోసం గ్రామాల మధ్య చిచ్చుపెట్టడాన్ని సహించబోమని హెచ్చరించారు. ఎవరికివారు పంచాయితీ భవనాలు నిర్మించుకొని, రెవెన్యూ రికార్డు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి దశలో కొనసాగుతున్న మాపట్ల రాజకీయ కుట్రలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రజాభిప్రాయం తీసుకోకుండా మళ్ళీ ఉమ్మడి గ్రామ పంచాయితీ చేయడానికి నిర్ణయం తీసుకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారిని కలసి వినతిపత్రం సమర్పించడం జరిగింది మా అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో రాములు,బోయ.మంగయ్య,బోయ.రాములు,పి.కృష్ణారెడ్డి,జె.జగదీశ్వర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,నరేందర్ రెడ్డి,నరేష్, హరిజన్.వెంకటేష్,బి.రాజు తదితరులు పాల్గొన్నారు.(Story : బలిజపల్లి, జంగమాయపల్లి జంట గ్రామాలను వేరు,వేరు గ్రామ పంచాయితీలుగా కొనసాగించాలి)