అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సురేష్ మహల్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం అఖిలభారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పిలుపుమేరకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నల్ల రిబ్బన్లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించారు. అధికార అహంకారంతో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఎంపీగా భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని అవహేళన చేసిన నీకు కేంద్ర హోం మంత్రి పదవికి అనర్హుడు అని తక్షణమే రాజీనామా చేయాలని అంబేద్కర్ పాదాల సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానిస్తే పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాలతో చేసిన పోరాటం ఢిల్లీ పురవీధుల్లో చేయాల్సిన పరిస్థితి మీ కేంద్ర బిజెపి పార్టీల ఆఫీసుల ముందు చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దని బిజెపికి కేంద్ర ప్రభుత్వ పెద్దలను హెచ్చరిస్తూ తక్షణమే ఈ దేశ ప్రధాని హోం మంత్రి పదవి నుండి అమిత్ షా నీ తప్పించాలని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, జిల్లా కార్యదర్శి రాయని చిన్న, పట్టణ అధ్యక్షులు బేతం దేవానంద్, నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు కొట్టే వెంకట్రావు,నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు పమిడిపల్లి ఇశ్రాయేలు, గౌరవ సలహాదారుడు కొమ్మ తోటి కృపయ్య, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరావు, కార్యదర్శి దార్ల యర్రయ్య, పట్టణ యూత్ అధ్యక్షులు కీర్తిపాటి రామారావు, వినకొండ మండల ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, పల్లపాటి భాస్కర్, డోలా కరుణ, అంబడిపూడి శ్రీను, దార హనుమయ్య,తదితరులు పాల్గొన్నారు.(Story : అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి )