విజయవంతమైన రక్తదాన శిబిరం
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల పరిధిలోని తోమాలపల్లి గ్రామం యందు శనివారం రోజున, గ్రామ మాజీ ఉపసర్పంచ్ కీర్తిశేషులు నరేందర్ రెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా, ఎస్వీఎస్ హాస్పిటల్ సహకారంతో, మెగా రక్త శిబిరం, మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తోమాలపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ తోక నరేష్ చేతుల మీదుగా ప్రారంభించి నారు. ఇట్టి కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, యువకులు, విజయవంతంగా చేయడానికి కృషి చేసినారని నిర్వాహకుడు బోయ ఆనంద్ తెలియజేసినారు. ఎస్వీఎస్ ఆసుపత్రి వైద్యులకు గ్రామ మాజీ ఉపసర్పంచ్ కీర్తిశేషులు నరేందర్ రెడ్డి భార్య హారిక వైద్యులను శాలువాతో సన్మానించారు .ఈ కార్యక్రమాన్ని తోమాలపల్లి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు మరియు గ్రామ యువకులు ,ధర్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి ,మధు, మొగులన్న, గుడిసె వసంత్, రంగన్న, ప్రకాష్ ,భరత్, రాముల యాదవ్, కృపాకర్ రెడ్డి ,బీచుపల్లి, మహేష్, కేశవర్ధన్ రెడ్డి , లాలు , పాల్గొన్నారు.(Story : విజయవంతమైన రక్తదాన శిబిరం )