UA-35385725-1 UA-35385725-1

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప‌డింది. ముఖ్యంగా రష్యా నుంచి వివిధ దేశాలకు చమురు సరఫరా విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో క్రూడాయిల్‌పై తీవ్ర ప్రభావం ప‌డింది. రష్యా నుంచి వచ్చే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం తటస్థంగానే వుండిపోయింది. అమెరికా వంటి దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించినప్పటికీ, భారత్‌ మాత్రం రష్యాను వ్యతిరేకించలేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్‌ను భారత్‌ కొనుగోలు చేస్తుందా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
భారతీయ చమురు సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీలు రష్యా ముడిచమురు (క్రూడాయిల్‌)ను భారీ రాయితీలకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏనాడో ఒప్పందాలు కుదిరాయి. ఒక బ్యారల్‌ 100 డాలర్ల మేర అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు వుండగా, భారత్‌కు అంతకన్నా తక్కువ ధరకే రష్యా అమ్ముతోంది. దానికి కారణమేమిటంటే, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌కు రష్యా అత్యంత సన్నిహితమైన మిత్రదేశం. దాదాపు 80 శాతం దిగుమతులు రష్యా నుంచే జరుగుతున్నాయి. అందులో ఆయిల్‌ కూడా వుంది. రష్యాకు భారత్‌ ప్రత్యేక దేశం అయినందున చమురు ధరల్లో కూడా తేడా వుంటుంది. భారత్‌, రష్యాల మధ్య ఏనాడూ సంబంధాలు చెడిపోలేదు. కొత్తగా ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో అమెరికా ఎంత రెచ్చగొట్టినా, ఒత్తిడి తెచ్చినా భారత్‌ మాత్రం తటస్థంగా వుందే తప్ప రష్యాను వ్యతిరేకించలేదు. ఇప్పటికిప్పుడు రష్యాపై విధిస్తున్న ఆంక్షలను భారత్‌ సమర్ధిస్తే నష్టపోయిదే భారతే. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నది. రష్యా నుంచి రాయితీపై ముడిచమురు దిగుమతి కొనసాగినట్లయితే, అమెరికా ఆంక్షలను భారత్‌ ఉల్లంఘించినట్లా కాదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. దీన్ని ఉల్లంఘనగా భావించలేమని ఇప్పటికే వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ అన్నారు. అయితే చరిత్రను మార్చాల్సిన సమయమిదేనని, రష్యాకు మద్దతివ్వడమంటే ఆక్రమణకు మద్దతు ఇవ్వడమేనని గుర్తించాలని సాకీ వ్యాఖ్యానించారు.
ఏదేమైనప్పటికీ, భారత్‌ ఒక్కటే కాదు..ఇంకా చాలా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నది. ఇందులో ప్రధాన దేశాలు వున్నాయి. అందుకే ఈ విషయం అమెరికాకు మింగుడుపడటం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని అనేక దేశాలు ఇంకా రష్యా ముడిచమురును కొనుగోలు చేస్తూనే వున్నాయి. ఉక్రెయిన్‌కు నేటికీ సరైన మద్దతు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇదే. నేటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలేంటో తెలుసా? ఓసారి తెలుసుకుందాం!
1. బల్గేరియా : బాల్కన్‌ ద్వీపకల్పంలోని అతిపెద్ద ఆయిల్‌ రిఫైనింగ్‌ సంస్థ నెఫ్తోచిమ్‌ బర్గాస్‌ రిఫైనరీ అనేది రష్యాకు చెందిన ల్యూకాయిల్‌ అనే సంస్థ యాజమాన్యంలో నడుస్తున్నది. ఇది బల్గేరియాలో వుంది. బల్గేరియా స్వదేశీ మార్కెట్‌లో ప్రాథమిక ఇంధన సరఫరాదారు ఇదే. 60 శాతం రష్యా క్రూడాయిల్‌ ఇక్కడకు నేరుగా సరఫరా అవుతున్నది. ప్రస్తుతం 40 శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగిస్తున్నది. అయితే ఆంక్షలకు తలొగ్గి వుండాల్సి వస్తే నూటికి నూరు శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగించగలగాలి. కానీ అంత సామర్థం నెఫ్తోచిమ్‌ బర్గాస్‌కు వుందా లేదా అన్నది తేలలేదు. కాకపోతే ల్యూకాయిల్‌ రష్యన్‌ సంస్థ కాబట్టి, ఈ అనుమతి బల్గేరియాకు ఇస్తుందా లేదా అన్నది అనుమానమే. ఇప్పటికైతే రష్యా మీద చమురు కోసం ఆధారపడాల్సిందేనని స్పష్టమవుతున్నది.
2. చైనా : యూరోపియన్‌ యూనియన్‌ తర్వాత రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద రెండవ దేశం చైనా. ఓవైపు యుద్ధం జరుగుతున్నా, సముద్రమార్గాన నౌకల ద్వారా చమురు సరఫరాలు మరింత పెరిగే అవకాశం వుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఎ) తెలిపింది. చైనాకు మరింత ముడి చమురు వెళ్లబోతుందని ప్రముఖ చమురు ఉత్పాదక పర్యవేక్షణ సంస్థ, కార్గో ట్రాకింగ్‌ డేటా ప్రొవైడర్‌, ట్రేడ్‌ ఫ్లో నిఘా సంస్థ అయితే పెట్రో`లాజిస్టిక్స్‌ భావిస్తున్నదని రాయిటర్స్‌ వార్తాసంస్థ పేర్కొంది.
3. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) : ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌లో 27 దేశాలున్నాయి. ఇప్పటివరకు ఈ దేశాలు 40 శాతం గ్యాసు, 27 శాతం ముడిచమురు దిగుమతుల కోసం రష్యాపైనే ఆధారపడి వున్నాయి. ఇప్పుడు రష్యా దిగుమతుల అదుపుపై అమెరికా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ దేశాలు రెండుగా చీలాయి. అయితే దీర్ఘకాలంగా సాగుతున్న రష్యా శిలాజ ఇంధనాల తవ్వకాల ప్రణాళిక ఈ మేనెలతో ముగిసే అవకాశం వుంది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్‌, ట్రాన్స్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌ నెఫ్ట్‌లపై కొత్త ఆంక్షలను ఆమోదించడానికి సిద్ధమైనప్పటికీ, వాటి నుండి చమురు కొనుగోలు కొనసాగుతుందని చెపుతోంది. ఇదొక విచిత్రమైన వైఖరి.
4. ఫ్రాన్స్‌ : 2021లో ఫ్రాన్స్‌ చేసుకున్న మొత్తం దిగుమతుల్లో 9.5 శాతం రష్యా ముడి చమురు ఉత్పత్తులే ఉండటం విశేషం. ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నట్లు ఫ్రెంచ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఇండస్ట్రీ (యుఎఫ్‌ఐపి) ఇంకా చెపుతూనే వుంది. రష్యన్‌ డీజిల్‌ను మాత్రం ఇప్పటికే కాదనుకున్నట్లు సమాచారం. కాకపోతే ఎక్కువ వ్యయం భరించాల్సి వుంటుంది.
5. జర్మనీ : జర్మనీలోని అతిపెద్ద రిఫైనరీ మిరో (ఎంఐఆర్‌ఓ)లో దాదాపు 14 శాతం ముడి చమురు రష్యా నుంచే వస్తున్నది. మిరో అంటే ది మినరల్‌ఆయెల్‌రఫైనెరీ ఒబెర్రీన్‌ గ్యాంభ్‌ రిఫైనరీ. ఈ సంస్థ ఫిలిప్స్‌66 అనే సంస్థతో సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్నది. ఫిలిప్స్‌66కు ఇందులో 18.75 శాతం వాటా వుంది. అలాగే, జర్మనీకి చెందిన మరో ఆయిల్‌ కంపెనీ పిసికె ష్వెద్‌ రిఫైనరీలో రోస్‌నెఫ్ట్‌ డ్యూష్‌ల్యాండ్‌ అనే సంస్థకు 54 శాతానికిపైగా వాటా వుంది. ఇది రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ అనే సంస్థకు అనుబంధ కంపెనీ. దానికి ద్రూజ్‌బా పైప్‌లైన్‌ ద్వారా చమురు పంపిణీ చేస్తారు. టోటల్‌ ఎనర్జీస్‌ యాజమాన్యంలో నడుస్తున్న లెవునా రిఫైనరీ సహకారంతో ఇది జరుగుతుంది. ఈ చిక్కులన్నీ జర్మనీకి వున్నాయి. ఇప్పటికిప్పుడు రష్యాతో ఢీ అంటే జర్మనీకే అధికంగా నష్టం.
6. గ్రీస్‌ : గ్రీస్‌ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ హెల్లెనిక్‌ పెట్రోలియంలో 2021 ద్వితీయార్థంలో దాదాపు 15 శాతం రష్యా ముడిచమురు ఖాతా వున్నట్లు ఆ సంస్థే చెపుతున్నది. అయితే రష్యాపై ఆంక్షలు తప్పవంటే, సౌదీ అరేబియా నుంచి అదనపు సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని చెపుతున్నది. ఇది కాస్త భారమే అయినా తప్పదంటోంది. కాకపోతే గ్రీస్‌ తొందరపడకుండా ఆచితూచి స్పందిస్తోంది.
7. ఇండియా : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూస్తాన్‌ పెట్రోలియం అధికభాగం రష్యా యూరల్స్‌ సంస్థపైనే ఆధారపడుతున్నది. ట్రేడిరగ్‌వర్గాల కథనం మేరకు మే నెల కోసం 2 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. అలాగే, భారత అగ్రశ్రేణి రిఫైనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మే డెలివరీ కింద యూరల్స్‌ నుంచి 3 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసిందని వాణిజ్యవర్గాలు వెల్లడిరచాయి. అంటే రష్యాను భారత్‌ వ్యతిరేకిస్తే మన దేశంలో కచ్చితంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. చమురుతోపాటు ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా రష్యా నుంచి అధికంగా వున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తటస్థంటా వుండాలన్న భారత్‌ వైఖరే ఉత్తమం.
8. ఇటలీ : ఇసాబ్‌ (ఐఎస్‌ఎబి) అనేది ఇటలీలో అతిపెద్ద రిఫైనరీ. స్విట్జర్లాండ్‌ ఆధారిత లిటాస్కో ఎస్‌ఎ దీని యజమాని. ఇది రష్యాకు చెందిన లూకాయిల్‌ నియంత్రణలో పనిచేస్తున్నది. మార్చి 4 నాటికి యథాప్రకారం దీని పనితీరులో ఎలాంటి మార్పు లేదు. వివిధ రకాల ముడిచమురు ప్రక్రియలను ఇది కొనసాగిస్తున్నది.
9. హంగేరీ : హంగేరియన్‌ ఆయిల్‌ గ్రూప్‌ ఎంఓఎల్‌కు ద్రూజ్‌బా పైప్‌లైన్‌ నుంచి నిరంతరాయంగా చమురు సరఫరా కొనసాగుతోంది. ద్రూజ్‌బా పైప్‌లైన్‌ రష్యాదే. పైగా రష్యాపై చమురు, గ్యాసుకు సంబంధించిన ఆంక్షలను హంగేరీ ప్రధానమంత్రి విక్టర్‌ ఓర్బాన్‌ మొదట్నించీ వ్యతిరేకిస్తూనే వున్నారు. ఇప్పటికీ అదే వైఖరితో వున్నారు.
10. నెదర్లాండ్స్‌ : డచ్‌ ప్రభుత్వం గానీ, రోటర్‌డామ్‌ పోర్ట్‌ గానీ రష్యా చమురుపై నిషేధం విధించలేదు. దాదాపు 30 శాతం చమురు రోటర్‌డామ్‌ పోర్ట్‌ ద్వారానే నెదర్లాండ్స్‌లోకి చేరుకుంటున్నది. అది పూర్తిగా రష్యాదే. ప్రతియేటా దాదాపు 20 మిలియన్‌ టన్నుల రష్యన్‌ చమురు ఉత్పత్తులు నెదర్లాండ్స్‌కు చేరుకుంటాయి. రష్యాపై ఆంక్షలు విధించాలన్న ఆలోచనే ఈ దేశానికి లేదని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.
11. పోలండ్‌ : పోలండ్‌ దేశంలో అతిపెద్ద రిఫైనరీ పికెఎన్‌ ఓర్లెన్‌. పోలండ్‌, లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోని రిఫైనరీలన్నీ రష్యా ముడిచమురుపైనే ఆధారపడి వున్నాయి. తప్పదంటే దేనికైనా సిద్ధమని, రష్యా సరఫరాపై పూర్తి నిషేధానికి రెడీ అన్నట్లుగా పోలండ్‌ చెపుతోంది. అయితే పోలండ్‌ గురించి ఆ దేశం చెప్పుకోవచ్చు. కానీ లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ల గురించి చెప్పే హక్కు ఆ దేశానికి లేదు. పైగా అమెరికా నుంచి అతిపెద్ద హామీ వుంటే తప్ప పోలండ్‌ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలిసింది.
12. టర్కీ : రష్యా చమురు ఉత్పత్తులు టర్కీ దేశానికి భారీగానే వస్తున్నాయి. రష్యా ముడి చమురు కొనుగోలును ఆపాలన్న ఆలోచనేదీ టర్కీకి లేదు. పైగా మాస్కోపై ఆంక్షలను ఈ దేశం ఇదివరకే బహిరంగంగానే తిరస్కరించింది. టర్కీలో తుప్రాస్‌ అనేది అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ. ఇది పూర్తిగా రష్యాపైనే ఆధారపడి వుంది. (Story: రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1