ఒకే రాష్ట్రం ఒకే రాజధాని
అమరావతి అజేయం
బాణాసంచా వెలుగుల్లో విరజల్లిన సంబరాలు
చింతూరు మండల కూటమి నాయకులు హర్షం
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండల కేంద్రంలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడం అత్యంత శుభ పరిమాణం అని హర్షం వ్యక్తం చేస్తూ ఇది రాష్ట్ర ప్రజలంతా గర్వంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయమని చింతూరు మండల కూటమి నాయకులు తెలియజేశారు.ఇకపై రాజధానిగా అమరావతి అజేయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి బిల్లుకు మద్దతు తెలియజేసిన ప్రధానమంత్రి కి మరియు హోం మంత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్, ఇందిరా రాజీవ్ సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా ఆంధ్రుల రాజధాని అమరావతి అని నినాదాలు చేశారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షుడు ఎండి జహంగీర్, ఇ ల్లా చిన్నారెడ్డి, ఓ రామారావు చౌదరి, మార్కెట్ కమిటీ సభ్యుడు, పి సాలమన్ రాజు, క్లస్టర్ ఇంచార్జ్ ఓ నరసింహారావు, జనసేన నాయకులు పేయ్యాల నాగేశ్వరరావు, మహిళా మండల అధ్యక్షురాలు మంగవేణి, ఎస్టి సెల్ అధ్యక్షులు తుర్రం ముత్తయ్య, కట్ట శంకర్, ఎండి రియాజ్, జగదీష్, ఎస్ కే జానీ, జనసేన నాయకులు బిడే సతీష్, బిజెపి మండల అధ్యక్షులు బట్ట లక్ష్మణరావు, చిట్టిబాబు, ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(story : ఒకే రాష్ట్రం ఒకే రాజధాని )

