UA-35385725-1 UA-35385725-1

కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో కెఎల్‌ యూనివర్శిటీకి గుర్తింపు

తమ కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలకు గానూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ
 
హైదరాబాద్, వడ్డేశ్వరం/విజయవాడ: మార్చి 2022 : గ్రాడ్యుయేషన్‌ మరియు ఉన్నత విద్యలో జాతీయ స్థాయిలో అగ్రగామి ఇనిస్టిట్యూట్‌లలో ఒకటైన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ కి ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌) చేపట్టిన సమర్థవంతమైన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి గానూ ప్రశంసలు దక్కాయి. యూనివర్శిటీ విద్యార్థులు ఎస్‌ఎస్‌ఎస్‌ కింద చురుగ్గా పలు కార్యక్రమాలు చేపట్టి తమ సేవలనందించారు, యువజన మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ విభాగం ఎన్‌ఎస్‌ఎస్‌. తమ తాజా కార్యక్రమంలో భాగంగా 12 గ్రామాలలోని 7వేల కుటుంబాలను యూనివర్శిటీ దత్తత తీసుకుంది. దీనిలో భాగంగా గ్రామాలలో బస్టాండ్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులు, గుర్తించబడిన స్ట్రీట్స్‌ సహా గ్రామాలలో పరిశుభ్రతను ప్రోత్సహించడం చేశారు.
మహమ్మారి విజృంభణ కొనసాగినప్పటికీ, కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ నుంచి 1000 మంది మెగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంబీఏ, బీబీఏ, సీఎస్‌ఈ, న్యాయ మరియు వ్యవసాయ శాఖలకు చెందిన 900 మంది విద్యార్ధులు పాల్గొనడంతో పాటుగా 100 మంది ఫ్యాకల్టీ, మేనేజ్‌మెంట్‌ సభ్యులు సైతం ఓ మహోన్నతమైన కారణానికి తోడ్పాటునందించారు. అన్ని కార్యక్రమాలనూ ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చేశారు. దత్తత తీసుకున్న గ్రామాలలో గుంటూరులోని పెదపాలెం, పాతూరు, రేవెంద్రపాడు, కొలనుకొండ, వడ్డీశ్వరం, గుండిమెడ, చిర్రావు, రామచంద్రాపురం, శృంగారాపురం, మేళ్లంపూడి, ఇప్పాటమ్‌, ఆత్మకూరు వంటివి ఉన్నాయి.
ఈ డ్రైవ్‌తో పాటుగా కెఎల్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ వలెంటీర్లు ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలను ఈ 12 గ్రామాల్లోనూ నిర్వహించారు. ఓ క్రమపద్ధతిలో నిర్వహించిన కార్యక్రమాలతో పాటుగా ప్రభావవంతైన వ్యర్థ నిర్వహణ వ్యవస్ధలు , ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ప్రకృతిలో కలవకుండా తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలిపారు. యూనివర్శిటీ యొక్క ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలను దత్తత తీసుకున్న అన్ని గ్రామాలలోనూ అమలు చేయడంతో పాటుగా స్థిరంగా వృద్ధి చెందేందుకు సైతం భరోసా కల్పించారు. ఈ విస్తృతశ్రేణి కార్యక్రమానికి అవసరమైన నిధులను యూనివర్శిటీతో పాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ పథకం కింద యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అందించింది.
పరిశుభ్రత అభివృద్ధి , భద్రత, స్వచ్ఛత దిశగా తమ పూర్తి నిబద్ధతలో భాగంగా కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ పలు కార్యక్రమాలను క్యాంపస్‌ లోపల స్వీకరించి క్యాంపస్‌ను 100% ప్లాస్టిక్‌ రహితంగా మార్చింది. ఈ యూనివర్శిటీలో సమర్థవంతమైన మురుగునీరు శుద్ధి ప్లాంట్‌ అందుబాటులో ఉంచడంతో పాటుగా వ్యర్థాలను వేరు చేయడం, రీసైకిల్‌ చేయడం, స్మార్ట్‌ ఎనర్జీ కన్వర్షన్‌ పద్ధతులను సైతం వినియోగిస్తున్నారు.
కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల యూనివర్శిటీ నిబద్ధతను గురించి కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పి. సారధి వర్మ మాట్లాడుతూ ‘‘స్వచ్ఛత కార్యక్రమాల అమలులో మా ఎన్‌ఎస్‌ఎస్‌ వలెంటీర్ల ప్రయత్నాలు, చూపిన నిబద్ధత, చుట్టు పక్కల గ్రామాలలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ క్లీన్‌ఇండియా కార్యక్రమం కింద మా ప్రధాన లక్ష్యం, గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరచడం, బహిరంగ మూత్ర విసర్జన ప్రక్రియలను తొలగించడం, పరిశుభ్రతా ప్రక్రియలలో అధిక శాతం కుటుంబాలు పాల్గొనేలా చేయడం’’అని అన్నారు.
గతంలో ఈ యూనివర్శిటీ క్యాంపస్‌కు మొదటి ర్యాంకును యూనివర్శిటీలు (ప్రైవేట్‌) విభాగంలో ఏపీ గ్రీన్‌ అవార్డులలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లో ఈ అవార్డు అందజేయగా, దక్షిణ మధ్య ప్రాంతంలో అత్యంత పరిశుభ్రమైన క్యాంపస్‌గా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) గుర్తించింది. ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ప్రస్తుతం కొన్ని అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాలతో కలిసి పనిచేస్తుంది. (Story: కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో కెఎల్‌ యూనివర్శిటీకి గుర్తింపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1