Homeవార్తలుఫిబ్రవరి 28న  ‘శబ్దం’

ఫిబ్రవరి 28న  ‘శబ్దం’

ఫిబ్రవరి 28న  ‘శబ్దం’

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: ‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ బానుప్రియ శివ సహనిర్మాత. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజా మేకర్స్ ‘శబ్దం’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 28, 2025న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ హీరో ఆది పినిశెట్టి ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది.
ఈ చిత్రాన్ని ముంబయి, మున్నార్, చెన్నైలోని అనేక ప్రదేశాలలో చిత్రీకరించారు. కేవలం ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసమే 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించారు.
సంగీత దర్శకుడు థమన్ సినిమా కోసం ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ ,ఆర్ఆర్ చేయడానికి హంగేరీకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి అరుణ్ పద్మనాబన్ డీవోపీగా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్
నిర్మాత: 7G శివ
బ్యానర్లు: 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్
సహ నిర్మాత: భానుప్రియ శివ
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ అరుణ్ బత్మనాభన్
ఎడిటర్: సాబు జోసెఫ్
ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్
స్టంట్స్ : స్టన్నర్ సామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్ బాలకుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్  (Story : ఫిబ్రవరి 28న  ‘శబ్దం’)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!