గీతమ్స్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ :– స్థానిక నరసరావుపేట రోడ్డులోని గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో చూపరులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి తమ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూ కు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది అని తెలియజేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థిని విద్యార్థులు అలరించారు. చివరిగా వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.(Story:గీతమ్స్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు)