360 డిగ్రీల బ్లేడ్ లెస్ కొత్త శ్రేణి ఏసీలను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్
న్యూస్‌తెలుగు/ ముంబయి: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్, తన తాజా ఆవిష్కరణ-చిల్డ్ వాటర్ ఇండోర్ కేటగిరీలో కొత్త విండ్-ఫ్రీ ఎయిర్ కండిషనర్‌లను ఆవిష్కరిస్తున్న ట్లు ప్రకటించింది. ఈ కొత్త శ్రేణిలో విండ్-ఫ్రీ, 360డిగ్రీల బ్లేడ్‌లెస్ టెక్నాలజీని చిల్డ్ వాటర్ ఆధారిత క్యాసెట్ యూనిట్లలో కలిగి ఉంది. ఇది వినియోగదారులకు డైరెక్ట్ కోల్డ్ డ్రాఫ్ట్ (నేరుగా వచ్చే శీతల ప్రవాహాలు) అసౌకర్యం లేకుండా అత్యుత్తమ కూలింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందింది. చిల్డ్ వాటర్ ఆధారిత క్యాసెట్ యూనిట్లు వినియోగదారులకు కావలసిన ఉష్ణోగ్రతను సెట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. విండ్‌ఫ్రీ కూలింగ్ సాంకేతికత 0.15మీ/సెకను గాలి వేగంతో 15,000 మైక్రో-ఎయిర్ హోల్స్ వరకు చ ల్లని గాలిని సున్నితంగా వెదజల్లుతుంది. (Story : 360 డిగ్రీల బ్లేడ్ లెస్ కొత్త శ్రేణి ఏసీలను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్)