పెయింటర్స్ నూతన కార్యవర్గం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక నేడు సిపిఎం పార్టీ కార్యాలయం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్గా ప్రముఖ చిత్రకారులు బొడ్డుచర్ల. ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ ఎం. మూర్తి, మరో వైస్ ప్రెసిడెంట్ ఆర్. శంకర్, సెక్రటరీగా కే. వందనం బాబు, జాయింట్ సెక్రెటరీ సిహెచ్. బాజీ, మరో జాయింట్ సెక్రటరీగా బీరం. శ్రీను, ట్రెజరర్ ఎస్.కె. సైదా, వీరిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కమిటీ రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుందని అలానే పెయింటర్స్ ఆర్టిస్ట్ లకు గవర్నమెంట్ ద్వారా అందవలసిన సంక్షేమ పథకాలు ఇంటి స్థలాలు గుర్తింపు కార్డులు కొరకు కృషి చేస్తామని వారికి అండగా పనిచేస్తామని వారన్నారు కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ ఎంవి. దానయ్య, ఎం. పౌలు రాజు, ఎస్. రాజు కుమార్ సింగ్, జి. చంద్రం, కే. నాగరాజు, పి. రామకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.(Story : పెయింటర్స్ నూతన కార్యవర్గం )