సంక్రాతి పండగ సందర్బంగా టి.పి.ఎల్ టోర్నమెంట్
న్యూస్ తెలుగు/వినుకొండ : సమీపంలోని తెల్లబాడు గ్రామంలో సంక్రాతి పండగ సందర్బంగా టి.పి.ఎల్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 12 టీమ్ లు పాల్గొనగా అందులో రెండు టీములు ఫైనల్ కు చేరుకున్నాయి. టోర్నమెంట్ లో తెల్లబాడు టీమ్ విజేతలుగా నిలిచారు. ముందుగా భోగి పండుగ రోజు మొదలుకొని ఆదివారం టోర్నమెంట్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధమ బహుమతి దారం అంజిరెడ్డి, దర్నాసి హనుమంత రావు తెల్లబాడు టీంకు అందజేశారు. రెండవ బహుమతి అంబడిపూడి వెంకటేష్ పాత ఉప్పలపాడు టీంకు అందజేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తెల్లబాడు టీం సాయి కి రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పాత ఉప్పలపాడు టీం కి కృష్ణ కు రావడం జరిగింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ లో గెలుపొందిన టీమ్ ఆనందంతో స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్బంగా ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి కమిటీ మెంబర్లు మాట్లాడుతూ. టిపిఎల్ టోర్నమెంట్ ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు సుబ్బారావు, విష్ణు, ఆంజనేయులు, ప్రసాద్, హనుమంతరావు, ఆదినారాయణ, షాలేమ్ రాజు, నాగరాజు, దేవరాజు, అజయ్, అజయ్ రాజు, దుర్గారావు, మహేష్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.(Story : సంక్రాతి పండగ సందర్బంగా టి.పి.ఎల్ టోర్నమెంట్ )