ప్రతిఒక్కరికీ మేలే లక్ష్యంగా కూటమి పాలన
వినుకొండలో చీఫ్ విప్ జీవీ నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మేలు జరగాలి, ఆ మంచిని పదిమందితో పంచుకోవాలన్నదే తను దేవుడిని కోరుకునే ఒకేఒక్క విషయమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , పట్టాలెక్కిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ఏడాది మొత్తం సానుకూల వాతవరణంలోనే సాగతుందని బలంగా నమ్ముతున్నా అన్నారు. వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కేకును కోసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు జీవీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అర్చకులు వేదమంత్రోచ్చారణతో జీవీ ఆంజనేయులుకు వేదాశీర్వచనం అందించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీను రాయల్, నిశ్సంకర శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి దంపతులు, కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పట్టణ, గ్రామీణ సీఐలు శరత్ బాబు, ప్రభాకర్, తదితరులు జీవీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవీ పిలుపు మేరకు ఆయనకు అభినందనలు తెలిపేందుకు వచ్చినవారు పుస్తకాలు, పెన్నులు, నిఘంటువులను అందజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఫొటోలు దిగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2024 క్యాలెండర్లను ఆవిష్కరించారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. (Story : ప్రతిఒక్కరికీ మేలే లక్ష్యంగా కూటమి పాలన)