ఆగ్ని బాధిత కుటుంబానికి బియ్యం,గిన్నెలు పంపిణి
న్యూస్‌తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం అగ్రహారపు కొడేరు గ్రామంలో కుంజా ముతమ్మ ఇల్లు ఇటీవల ప్రమాదవశాత్తు దగ్ధం అయింది .నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ ఆదేశాలు మేరకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లో బాధిత కుటుంబానికి బియ్యం,బట్టలు, గిన్నెలు సోమవారం పంపిణి చేశారు . ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి , తెలుగు యువత కార్యదర్శి శీలం తమ్మయ్య ,పగా ప్రసంగీ ,బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ఆగ్ని బాధిత కుటుంబానికి బియ్యం,గిన్నెలు పంపిణి)