పశు వైద్య శిబిరాలు
న్యూస్‌తెలుగు/ చింతూరు : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్రం మొత్తం మీద పశు ఆరోగ్య శిబిరాలు జనవరి 20 నుండి జనవరి 31 వరకు ప్రతి రోజు మండలానికి రెండు శిబిరాలు జరిగే విదంగా ప్రణాళిక చేసారు. దీనిలో భాగంగా చింతూరు మండలంలో సోమవారం రోజు కుమ్మూరు, చింతూరు గ్రామాల్లో రెండు టీములు ద్వారా రెండు శిబిరాలు నిర్వహించారు . ఈ కార్యక్రమనికి కుమ్మూరు సర్పంచ్ ముచ్చిక నాగార్జున ప్రారంబించారు. కుమ్మూరు గ్రామ పశు ఆరోగ్య శిబిరంలో మొత్తం 63 రైతులు పాల్గొని తమ పశువులకు, జీవాలకు కావలిసిన మందులు, ఆరోగ్యం బాగోలేని వాటికి చికిత్సలు చేయించడం జరిగింది. చింతూరు గ్రామ పశు ఆరోగ్య శిబిరంలో 40 రైతులు పాల్గొన్నారు. పశువులకు టీకాలు వేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో వెటర్నరీ డాక్టర్ శ్రీను, అన్వేష్ పాల్గొన్నారు. (Story : పశు వైద్య శిబిరాలు)