నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన స్థలం ఫోటు
కోర్డు వివాద స్థలంపై కూటమిలో వర్గపోరు
నడిరోడ్డుపై బాహాబాహీకి సిద్దమైన ఇరు వర్గాలు
స్థానిక ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ
న్యూస్ తెలుగు/విజయవాడ : కోర్టు వివాదంలో ఉన్న స్థలం విషయంలో టీడీపీకి చెందిన రెండు వర్గా మధ్య వర్గ పోరుతో వివాదం చెలరేగింది. దీంతో నడి రోడ్డుపై ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వివాదానికి దారి తీయటంతో పోలీసులు కలుగజేసుకోవటంతో వివాదం సర్దుమణిగి పంచాయితీ ఎమ్మెల్యే వద్దకు చేరింది. వివరాల్లోకి వెళితే..స్థానిక టీడీపీ, జనసేన నాయకుల కథనం మేరకు కృష్ణలంక 22వ డివిజన్లోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిని అనుకుని ఉన్న స్వర్గపురి రోడ్డులో పట్టుమని పది గజాలు లేని స్థలం విషయంలో తూర్పు టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంత కాలంగా ఆదిపత్య పోరు కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులైన ఓ కార్పొరేటర్ అండదండలతో వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన కొందరు కోర్డు వివాద స్థలంలో బడ్డీకొట్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా వివాదం చోటు చేసుకుంది.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కష్ట కాలంలో కూడా అండగా నిలిచిన స్థానిక టీడీపీ నాయకులను కాదని పటమటకు చెందిన టీడీపీ నాయకుల పెత్తనం ఇక్కడేంటని స్థానిక టీడపీ, జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కోర్టు వివాదంలో ఉన్న ఇదే ప్రాంతంలో కొబ్బరి బోండాల వ్యాపారం నిర్వహిస్తోన్న వారిని తొలిగించి ఈ స్థలాన్ని కాళీచేయించింది టీడీపీ ఆధ్వర్యంలోనేనని, మొన్న అక్రమం అయినప్పుడు ఇప్పుడు సక్రమం ఎలా అవుతుందని స్థానిక ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని, ఇలాంటి ఆక్రమణల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని స్తానిక నాయకులు చెబుతున్నారు. కాని పటమటకు చెందిన నాయకులు తమ డివిజన్లో పెత్తనమేంటని టీడీపీ, జనసేన డివిజన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలాన్ని ఏ ఒక్కరు ఆక్రమించి వ్యాపారం నిర్వహించినా తాము సహించేదిలేదని, తాము కూడా ఆక్రమణకు దిగుతామని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే కోర్డు నోటీసు, ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఓ వర్గానికి కొమ్ముకాస్తారా? లేక ఇరు వర్గాల మధ్య వర్గ పోరును సరి చేస్తారోనని స్థానికులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. (Story : నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన స్థలం ఫోటు)