4 రోజుల్లో రూ.26.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన
“క” మూవీ
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్, టికెట్స్ డిమాండ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సినిమా దీపావళి పోటీలో రిలీజై రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. “క” సినిమాకు నాలుగు రోజుల్లో 26.52 కోట్ల రూపాయల వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీవాళి విన్నర్ గా “క” సినిమా స్ఫష్టమైన ఆధిక్యత చూపిస్తోంది. 5వ రోజు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండటం ఈ సినిమా చేయబోతున్న సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ ను ప్రెడిక్ట్ చేస్తోంది.
తెలుగులో మంచి కలెక్షన్స్ దక్కించుకుంటున్న “క” సినిమా ఇదే ఘన విజయాన్ని ఆశిస్తూ వచ్చే వారం ఇతర భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్ (Story : 4 రోజుల్లో రూ.26.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన “క” మూవీ)