Homeటాప్‌స్టోరీగిరి పల్లెలకు రహదారుల గోస తీరేది ఎప్పుడు

గిరి పల్లెలకు రహదారుల గోస తీరేది ఎప్పుడు

గిరి పల్లెలకు రహదారుల గోస తీరేది ఎప్పుడు

న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని సుస్మిర్ ఒర్రెలు ఉప్పంగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే గిరిజన గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఓర్రెలు గిరిజన గ్రామాల ప్రజలకు అడ్డుగా మారాయి. 14 గ్రామాల ప్రజలు భారీ వర్షాలు కురిసినట్లయితే ఎటు వెళ్లలేని పరిస్థితిగా మారుతుంది. అత్యవసర సమయంలో గర్భిణీ మహిళలు ఆసుపత్రికి రావాలన్న ఇబ్బందిగా మారింది.ఒకవైపు రహదారులు బురదమయం, మరోవైపు ఓర్రెలు ఉప్పొంగడంతో ఎలాంటి వాహనాలు సైతం నడవలేని పరిస్థితిగా మారిందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాలు తిప్పలు పడేదని గిరిజన గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఓర్రెలపై వంతెనలు మంజూరు చేసి గిరిజన గ్రామాల ప్రజలు తిప్పలను తీర్చాలని కోరుతున్నారు. (Story : గిరి పల్లెలకు రహదారుల గోస తీరేది ఎప్పుడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments