వైద్య మిత్ర డిమాండ్లను పరిష్కరించడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి
న్యూస్తెలుగు/వినుకొండ: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్య మిత్రాలు గత 18 సంవత్సరాలు నుండి అతి తక్కువ వేతనం తో పనిచేస్తున్నామని మాకు మా సర్వీస్ ను గుర్తించి కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎక్స్గ్రేషియా రిటైర్మెంట్ అయిన తరువాత 15 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 29వ తారీఖున నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెంటనే స్పందించి ప్రభుత్వం సమ్మెను విరమింప చేసేలా ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీ ఈఓ సమక్షంలో ఆరోగ్య మిత్ర యూనియన్ రాష్ట్ర దళిత గిరిజన ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరియు టీం లీడర్ల యూనియన్ ట్రస్టు అధికారుల సమక్షంలో మా సమస్యలను ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహన అధికారి సానుకూలంగా స్పందించి మీకు నూతన జీతల ఫైలు క్యాడరు మీరు కోరిన విధంగా బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రభుత్వానికి మినిట్స్ ఫైల్ తయారుచేసి పంపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేము వెంటనే సమ్మెను వాయిదా వేస్తూ రోగులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో వీధుల్లో జాయిన్ విధులు నిర్వహించడం జరుగుతుంది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మేము ఇచ్చిన వినతి పత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్తి కుమార్ కు పంపించటం, వెంటనే వారు స్పందించి చర్చిలకు పిలవటం చాలా హర్షించదగ్గ విషయమని రాష్ట్ర వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు ముఖ్యమంత్రి కి మరియు వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తొందరగా ఫైలు అయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడాలని బుధవారం వినుకొండ పట్టణంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ను కలిసి అభినందించటం జరిగింది. మీరు చేసిన కృషి ముఖ్యమంత్రి స్పందించిన విధానం రాష్ట్రంలో వైద్యమిత్రాలు ఎప్పుడు మరచిపోబోమని రాష్ట్రంలో వైద్యం మిత్రులందరూ కూటమి ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించి శాలువా పుష్పగుచ్చం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింగల్ శెట్టి వెంకటేశ్వర్లు, చలిబిండి హనుమంతరావు, నాగలక్ష్మి, హరినాయక్, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. (Story : వైద్య మిత్ర డిమాండ్లను పరిష్కరించడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు)