ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చవ్వా భారతి కి సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా కేంద్రంలోని ఏడవ వార్డు పీర్లగుట్ట దగ్గర నివసించే నక్కరఘు శ్రీమతి భారతి డి.ఎస్సి ఎస్. జి. టీ పోస్టులో సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం అందించిన నియామక పత్రాన్ని స్వీకరించి త్వరలో ఉపాధ్యాయురాలు కాబోతున్నందుకు వారి ఇంటికి వెళ్లి ఆమెను ఘనంగా అఖిల పక్షపక్ష ఐక్యవేదిక నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల డీఎస్సీలో డిస్టిక్ ఏడవ రాంక్ సాధించిన భారతి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, వనపర్తి జిల్లాలో డీఎస్సీలో సెలెక్ట్ అయి ర్యాంకులు సాధించి నియామక పత్రాలు అందుకున్న అందరికీ ఈ సన్మానం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, తెలుగుదేశం నాయకులు కొత్త గొల్లశంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అశ్విని రమేష్, శివకుమార్, రమేష్, రాములు,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. (Story : ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చవ్వా భారతి కి సన్మానం)