మహేష్ గౌడ్ నియామకం పట్ల వెంకట్ గౌడ్ హర్షం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: పీసీసీ అధ్యక్షునిగా మహేష్ గౌడ్‌ను నియమించడం పట్ల రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, కంటెస్టెడ్ కార్పొరేటర్ గుర్రం గూడ పందుల వెంకట్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమపడిన బడుగు బలహీన వర్గాల ప్రతినిధి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు వారసుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి, బావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి, వెన్నుతట్టి ప్రోత్సహించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. (Story: మహేష్ గౌడ్ నియామకం పట్ల వెంకట్ గౌడ్ హర్షం)