పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తులను త్వరగ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు పరిష్కరించిన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రారంభించాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ, నీటిపారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు వారి లాగిన్ పరిధిలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న లేఔట్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని, లాగిన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వశక్తి మహిళా సంఘాలకు ప్రస్తుత సంవత్సరం నిర్దేశించిన బ్యాంకు లింకేజ్ రుణాలను సకాలంలో అందించాలని అన్నారు. సమావేశంలో వనపర్తి మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్, ఇతర మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి)