వినుకొండ కోర్టు నందు జాతీయ మెగా లోక్ అదాలత్
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్ మహతి ఆదివారం జాతీయ మెగా లోక్ అదాలత్ ను వినుకొండ కోర్టు నందు నిర్వహించినారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడిన బ్యాంకు కేసులు, ప్రామిసరీ నోట్ , చెక్ బౌన్స్ , మనోవర్తి, బార్య భర్త తగాదాలు, గృహ హింస, విడాకులు, తగాదాలు, ప్రైవేట్ కంప్లైంట్స్, ప్రి లిటిగేషన్ కేసులు,పెట్టి కేసులు,మరియు ఇతర కేసులు ఈ లోక్ అదాలత్ లో రాజీ చేయడం జరిగింది. జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. చట్టాల గురించీ అవగాహన కలిగి వుండాలి అని, చిన్న చిన్న తగాదాలకు పోలీస్ స్టేషన్ లా చుట్టూ,కోర్టుల చుట్టూ తిరిగి తమ విలువైన సమయాన్ని కోల్పోవద్దు అని, రాజీ మార్గమే రాజ మార్గం అని తెలిపారు.సమస్యలను సమరస్యముగా రాజీ పద్దతులలో పరిష్కరించుకోవాలి అని, వివాదాలకు దూరంగా ఉండాలి అని, చట్టల పట్లా అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు. మొత్తం సుమారు 199 రాజీ పడిన సివిల్,క్రిమినల్, పి ల్ సీ, చెక్ బౌన్స్, మెయిన్టేనేన్స్, బ్యాంక్ కేసులను, ఎస్.టి.సి. కేసులు మెగా లోక్ అదాలత్ నందు పరిష్కరించి 95,64,561/- రూపాయలను కక్షి దారులకు ఇప్పించడం జరిగిందని న్యాయమూర్తీ ఎమ్ మహతి గ తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎం.వి నాయుడు, చాగంటి విరాంజనేయ చౌదరి, లోక్ అదాలత్ మెంబర్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, సీనియర్ మరియు జూనియర్ న్యాయావాదులు ,పోలీసులు, కోర్టు సిబ్బంది,లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : వినుకొండ కోర్టు నందు జాతీయ మెగా లోక్ అదాలత్)