ఖాదర్ షా వలీ బాబాకు చాదర్ సమర్పించిన మిమ్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ వర్మ
న్యూస్‌తెలుగు/విజయనగరం: సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ 66వ సూఫీ సుగంధ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబా మెట్ట వద్ద ఉన్న ఆయన దర్గాను మిమ్స్ వైస్ చైర్మన్ డాక్టర్ బిహెచ్‌వీకే ప్రవీణ్ వర్మ సందర్శించి, చాదర్ సమర్పించారు. ముందుగా ఖాదర్ బాబా దర్భార్ ప్రియ శిష్యులు హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులు చీమలపాడు దర్గా పీఠాధిపతి మొహమ్ముద్ ఖ్వాజా మోహియునుద్దీన్ షా తాజ్ ఖాదరి, విజయనగరం సూఫీ దర్గా, దర్బార్ షరీఫ్ ముతవల్లి డా. మొహమ్ముద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ వద్ద ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ వర్మ మాట్లాడుతూ ప్రతిఏటా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడానికి అనేక రాష్ట్రాల నుండి విచ్చేస్తున్న భక్తులందరికీ పూర్తిస్థాయి వసతులు కల్పిస్తున్న వీరికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. రానున్న కాలంలో మరెన్నో ఉత్సవాలను నిర్వహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో గణేష్, తదితరులు పాల్గొన్నారు. (Story: ఖాదర్ షా వలీ బాబాకు చాదర్ సమర్పించిన మిమ్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ వర్మ)