ఏపీ శాసన మండలి చైర్మన్‌పై కన్ను?
బలం పెంచుకునే పనిలో కూటమి
చైర్మన్‌పై అవిశ్వాసం దిశగా అడుగులు!
అసెంబ్లీలో బలమున్నా.. మండలిలో తగ్గుదల
కూటమి వ్యూహంపై వైఎస్‌ఆర్‌సీపీ ఆందోళన
న్యూస్ తెలుగు/అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో తిరుగులేని శాసన సభ్యులతో ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ కనీసం ప్రతిపక్ష హోదా రాకపోవడంతో అసెంబ్లీలో అధికార పక్షం, ప్రతిపక్షం అంతా కూటమి పరంగానే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. దీంతో శాసన మండలిలోను బలం పెంచుకునే పనిలో కూటమి పావులు కదుపుతోంది. కూటమి ఎలాంటి వ్యూహం రచిస్తోందన్న ఆందోళన.. అత్యధిక బలం ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులను వెంటాడుతోంది. వీలైతే వచ్చే సమావేశాల్లో శాసన మండలిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారముంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు మిగిలిన ఆ పార్టీ 10 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ప్రేలవంగా కొనసాగాయి. కూటమి ఎమ్మెల్యేల మెజార్టీతో వైఎస్‌ఆర్‌సీపీకి మింగుడు పడటంలేక ఇక..బయటకే వారు పరిమితమయ్యారు. ఇక..కూటమికి ఎదురుచెప్పేవారే లేక తమ బిల్లులు అన్నీ పాస్ అవుతున్నాయి. శాసన మండలిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ వైసీపీ బలం పూర్తిగా ఉంది. ఒక వైపు అసెంబ్లీకి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వగా, శాసన మండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు పూర్తిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్, 142 హమీలు, తొమ్మిది నెలల కాలంలో చేసిన అభివృద్ధి పనులపై అడుగడుగునా నిలదీశారు. ఇటీవల యువత పోరుకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ సమయంలో మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల అంశాలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దాన్ని చైర్మన్ తిరష్కరించడంతో పెద్దఎతున్న పోడియం వద్దకు వెళ్లి ఆందోళనబాట పట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లింది. మూడుసార్లు వాయిదాల పర్వం కొనసాగింది. ఇది కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్సీలను ఇరకాటంలోకి నెట్టింది. అసెంబ్లీలో పూర్తి బలం ఉన్నా, శాసన మండలిలో కూటమికి లేకపోవడంతో మింగుడుపడటం లేదు. అందుకే ఆ దిశగా శాసన మండలిలోనూ కూటమి బలం పెంచుకునే దానిపై దృష్టి పెట్టింది. క్రమంగా ఖాళీలవుతున్న స్థానాల్లోకి కూటమి అభ్యర్థులు రంగ ప్రవేశం చేయడంతో కూటమికి సభ్యుల సంఖ్య తోడవుతున్నారు. అనుకున్న సంఖ్యా బలం వచ్చినప్పుడు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమ గోదావరిజిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యే మోషెన్‌రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి, ఆ తర్వాత మండలి చైర్మన్‌గా ఆయనకు పగ్గాలను అప్పగించారు. ఇంకా ఆయన పదవి దాదాపు రెండున్నర సంవత్సరాలకుపైగా ఉంది. ఈ సమయంలో ఆయనపై అవిశ్వాసం పెట్టాలంటే తగిన సంఖ్యా బలం ఉండాల్సిందే. ఇందుకోసం కూటమి ఎదురుచూస్తోంది.
శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిపత్యం
శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పూర్తి ఆధిపత్యం కొనసాగింది. ప్రతి అంశంలోనూ వారు అధికార కూటమిపై నిరసనలతోను, ప్రశ్నలతోను మాటల దాడి చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కనుసన్నల్లో వ్యూహాత్మకంగా వైసీపీ తన పాత్ర పోషించింది. చర్చలు, ప్రశ్నోత్తరాలలో అడుగడగునా కౌంటర్లు, వాకౌట్లతో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి..కూటమి పార్టీల్లో చేరారు. మిగిలిన వారంతా వైఎస్‌ఆర్‌సీపీని అంటిపెట్టుకుని ఉన్నట్లు కన్పిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగడంతో శాసన మండలిలో ఆమోదమైన కీలక బిల్లులు మండలికి వస్తే..వాటికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మండలిలో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, బడ్జెట్ సమావేశాల్లో మాత్రం మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిపత్యం కొనసాగింది. అధికార పార్టీ కూడా అదే రీతిలో మంత్రులతో కౌంటర్లు ఇప్పించినప్పటికీ, అవి పూర్తిగా వైసీపీ వారిని నిలువరించలేకపోయింది. దీని ప్రభావంతో మండలి సమావేశాల్లో నిత్యం నిరసనలు, వాడివేడిగా జరిగాయి.
శాసన మండలిలో బలబలాలిలా ..
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. అందులో 20 మంది ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికవుతారు. మరో 20 మంది స్థానిక సంస్థల కోటాలో ఎన్నికవుతారు. ఐదుగురు పట్టభద్రులు, ఐదుగురు టీచర్ల కోటాలో సభ్యులను ఎన్నుకుంటారు. మిగిలిన ఎనిమిది మంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు. ఈ క్రమంలో మండలిలో కూటమి ఎమ్మెల్సీల బలం పెరగడంతో చైర్మన్‌పై అవిశ్వాసం పెడుతుందనే వార్తలు వస్తున్నాయి. మండలిలో చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే సగం మంది సభ్యుల కన్నా ఒకరు ఎక్కువుగా ఉండాలి. దీని లెక్క ప్రకారం మొత్తమున్న 58 మంది సభ్యుల్లో సగానికిగాను 29 మంది సభ్యులు ఉండి తీరాలి. దానికి అదనంగా ఒక సభ్యుడు ఖచ్చితంగా తోడవ్వాలి. మొత్తం 30 మంది సభ్యులు ఉంటే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూటమికి 11 మంది సభ్యులే ఉండటంతో పరిస్థితి భిన్నంగా ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నలుగురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు.వారిలో జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ తమ రాజీనామాలను చైర్మన్‌కు ఇచ్చారు. అవి ఇప్పటివరకు చైర్మన్ ఆమోదించలేదు. వాటిని వెంటనే ఆమోదిస్తే..ఆ నాలుగు ఖాళీలు కాస్తా టీడీపీ, జనసేన కోటాలోకి వెళ్లిపోతాయి. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు ఎమ్మెల్యేల బలం లేకపోవడం, దానికి తోడు అధికారం దూరం కావడంతో మళ్లీ ఆ నాలుగు స్థానాలను దక్కించుకునే పరిస్థితి లేదు. ఆ నలుగురికి తోడుగా మరో ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో బలాబలాలు ఇలా ఉన్నాయి. వైఎస్‌ఆర్‌సీపీకి 43 మంది సభ్యులు ఉండగా..వారిలో నలుగురు రాజీనామా చేసినా అవి ఆమోదం పొందలేదు. ఇక మిగిలిన 36 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలకు ముగ్గురు టీచర్స్ ఎమ్మెల్సీల మద్దతు ఉంది. ఆ లెక్కన రాజీనామాలు చేసిన నలుగుర్ని మినహాయిస్తే…వైఎస్‌ఆర్‌సీపీకి 39 మంది సభ్యులు ఉంటారు. కూటమి పార్టీలో టీడీపీకి 10 మంది, జనసేనకు ఒక్కరు ఉన్నారు. మిగిలిన వారు ఇండిపెండెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మార్చిలో రిటైర్ అయిన ఐదుగురు ఎమ్మెల్సీలు కూటమికి తోడైనా కూడా కూటమికి బలం పెరిగే అవకాశం లేదు. ఈ క్రమంలో మండలి చైర్మన్‌పై అవిశ్వాసం కూటమి పెడుతుందా?, లేక అదును చూసి వ్యూహం పన్నుతుందా? అనేదీ రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. (Story: ఏపీ శాసన మండలి చైర్మన్‌పై కన్ను?)
Follow the Stories:
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!