రైల్వే స్టేషన్ ఆవరణలో సీతారాముల కల్యాణ మహోత్సవం
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతా రాముల ఉత్సవా విగ్రహాలని పట్టణంలో ఊరేగించి మధ్యాహ్నం కళ్యాణం నిర్వహించారు. అనంతరం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం మానవ సేవా సంఘం కార్యదర్శి భవాని శంకర్ అధ్యక్షులు పీవీ సురేష్ వారు మాట్లాడుతూ. గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎంతో సోదర భావంతో రైల్వే స్టేషన్ ఆవరణలో కళ్యాణ మహోత్సవం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని వారి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ వెంకట్రావు, రమణయ్య, కొండలు, ప్రసాద్, రాజా, జానీ, తదితరులు పాల్గొన్నారు.(Story : రైల్వే స్టేషన్ ఆవరణలో సీతారాముల కల్యాణ మహోత్సవం )