కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు
న్యూస్ తెలుగు/సాలూరు : కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు పట్టణంలో జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉదయం నుండి పట్టణంలోఉన్న రామాలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న అక్కేన వీధి రామ మందిరం, పెద్ద కోమటి పేట రామాలయం, డబ్బి వీధి రామాలయం, మెంటాడి వీధి, గుమడాం రామాలయం తో పాటు పట్టణంలో ఉన్న వివిధ రామ మందిరాలతో పాటు మండలంలో ఉన్న మామిడిపల్లి, శివరాంపురం, జీగిరాం, పేదబోరబంధ తదితర గ్రామాల్లో రామాలయాల్లో శ్రీ సీతరామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామ కళ్యాణోత్సవం లో పాల్గొనడం జరిగింది. కళ్యాణం సందర్భంగా రామాలయాలన్నీ సర్వాంగ సుందరంగా తయారు చేశారు. కొన్ని ఆలయాల్లో అఖండ అన్న సమారాధన కార్యక్రమం భక్తులు చేపట్టారు.(Story : కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు )