Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం
రాజధానిలో సొంత ఇంటికి శ్రీకారం
9వ తేదీన భూమి పూజకు సన్నాహాలు?

న్యూస్ తెలుగు/అమరావతి: ఇళ్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు..అనే చందంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అదే సమయంలో రాజధానిలో చంద్రబాబుకు సొంతిళ్లు లేదన్న విపక్షాల ఆరోపణలకు ఆయన చెక్‌పెట్టారు. అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఏప్రిల్‌ 9వ తేదీన భూమి పూజ చేయనున్నారు. నూతనంగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఇ6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసిన విషయం విదితమే. ఆ రోజు అక్కడ వైభవంగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే రాజధాని పనుల ప్రారంభోత్సవానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమం నిర్వహణకుగాను ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు దిల్లీకి వెళ్లారు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్‌ మూడో వారంలో రాజధాని పనుల ప్రారంభానికిగాను ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. ప్రధాని పర్యట‌నపై త్వరలో స్పష్టత రానుంది. రాజధాని పనులకు ముందే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, భూమి పూజ చేసి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఇంటి నిర్మాణ పనులను ఒక నిర్ణీత కాల పరిమితితో పూర్తి చేసుందుకు ప్రణాళిక రూపొందించారు. సీఎం నివాస స్థల ప్రాంతం అమరావతి ప్రభుత్వ భవనాల సముదాయానికి దాదాపు 2 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉండవల్లిలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో సొంత ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే చంద్రబాబు అక్కడకు వెళ్తారు. ఈ నిర్మాణ పనులను చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి స్వయంగా పరిశీలిస్తున్నారు.

అమరావతి పనులు వేగవంతం
సీఎం ఇంటి నిర్మాణంతో అమరావతి రాజధాని పనులు మరింత వేగవంతం కానున్నాయి. సీఎం నివాస నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాముఖ్యంతో చూస్తోంది. భవిష్యత్తులో ఇది ఒక ప్రతిష్టాత్మక స్థలంగా మారనుందని టీడీపీ శ్రేణులు తెలుపుతున్నారు. అమరావతి నగర అభివృద్ధికి ఈ ఇంటి నిర్మాణం ఒక సంకేతంగా మారనుంది. అభివృద్ధి పనులకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. సీఎం ఇంటి పరిసర ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజ్‌ సదుపాయాలు మెరుగుపరిచే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో అమరావతి మరింత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చెందనుంది. ఇంటి నిర్మాణంలో బహుళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి ప్రత్యేక గదులు, వాహనాల పార్కింగ్‌ వంటి అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకున్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంటి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది, వాస్తు సిద్ధాంతులు కలిసి స్థలాన్ని పరిశీలించారు. భూమి చదును చేసే పనులను ప్రారంభించారు.

ఏప్రిల్‌ 20లోగా అమరావతికి మోదీ
అమరావతి రాజధాని పనుల ప్రారంభోత్సవంలో భాగంగా ఏప్రిల్‌ 20వ తేదీలోగా ప్రధాని మోదీ వచ్చే అవకాశముంది. తొలి దశలో రాజధాని నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.64,721 కోట్లు వెచ్చింది. ఇందులో రూ.37,702 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. ఈనెల 17వ తేదీన రాష్ట్ర మంత్రిమండలిలో ఆమోదం తర్వాత రాజధాని పనులకుగాను కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు అగ్రిమెంట్‌ లెటర్లు జారీజేస్తారు. వర్క్‌ ఆర్డర్లు విడుదలైన వెంటనే ఏజెన్సీ నిర్వాహకులు రాజధానిలో పనులు ప్రారంభిస్తారు. రాజధాని పనుల కోసం కేంద్ర సహకారంతో వరల్డ్‌ బ్యాంక్‌, ఆసియన్‌ డవలప్‌మెంట్‌ బ్యాంక్‌, హడ్కో నుంచి రుణాలు వచ్చాయి. మరిన్ని రుణాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాటిని ప్రణాళిక బద్దంగా అమలు చేస్తూ, రాజధాని పనులును 2027లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. (Story: ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!)

Follow the Stories:

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ స్పీచ్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!