సుబ్రమణ్యస్వామి షస్టి సందర్భంగా పాలకావడితో అభిషేకానికి తరలిన స్వాములు
న్యూస్ తెలుగు/వనపర్తి : సుబ్రమణ్యస్వామి షష్టి సందర్భంగా ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యములో వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,కె. వి.ఆర్, ఉంగ్లమ్మ్.తిరుమల్ గురుస్వాముల పర్యవేక్షణలో గణపతి ఆలయం నుండి అధ్యక్షులు మారం.బాలకృష్ణ,నగేష్ జెండా ఊపి పాలకావడితో బయలుదేరిన భక్తుల ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తుకృష్ణ,వాకిటి.శ్రీధర్ గురుస్వాములు మాట్లాడుతూ 12ఏండ్లుగా భక్తుల కోరికలు నెరవేరాలని కావాడితో సుబ్రమణ్య స్వామికి అభిషేకాలు నిర్వహిస్తున్నాము అని అన్నారు. సుబ్రమణ్య స్వామినీ దర్శించడం వల్ల కుజదోషం తొలగి,ఉద్యోగాలు వచ్చి,మనశ్శాంతి వంటి రుగ్మతలు తొలగుతాయని అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది అని అన్నారు.(Story : సుబ్రమణ్యస్వామి షస్టి సందర్భంగా పాలకావడితో అభిషేకానికి తరలిన స్వాములు)