ఇసుక, కంకర రోడ్లపై ఉంచరాదు
మున్సిపల్ కమీషనర్
న్యూస్‌తెలుగు/వినుకొండ : వీధి రోడ్లను ఆక్రమించి పాదచారులకు, వాహనాలకు అంతరాయం కలిగిస్తున్న నిర్మాణ సామగ్రి సమస్యపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ నివాసితులు మరియు నిర్మాణ సంస్థలు తాము చేపట్టిన కట్టడాల వద్ద రోడ్లపైనే ఇసుక కంకర ఇటుకలు వంటి సామగ్రిని రోజుల తరబడి వదలి వెయ్యడం వల్ల ప్రమాద కారకాలుగా మారనున్నాయని మరియు డ్రెయిన్లలో పడి మురుగునీటికి అడ్డంకులు అవుతున్నందున నిర్మాణాలు చేపట్టు వారు నివాసితులకు వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా నిర్మాణం పూర్తి చేసేవరకు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు కూడా చూసుకోవాలని కోరారు .ప్రమాదాలను నివారించడానికి ప్రజల భద్రతను నిర్ధారించడానికి మరియు సాఫీగా ట్రాఫిక్‌ను సులభతరం చేసి స్పష్టమైన రోడ్లను నిర్వహించడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మునిసిపల్ కమీషనర్ ఆదేశాలిచ్చారు .రోడ్లను అంతరాయం లేకుండా ఉంచేందుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని చెప్పారు. (Story : ఇసుక, కంకర రోడ్లపై ఉంచరాదు)