బ్యాంకు రుణాలు డిసెంబర్, 21 నాటికి వందశాతం గ్రౌండింగ్ చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న బ్యాంకు రుణాలు డిసెంబర్, 21 నాటికి వందశాతం గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి బ్యాంకర్లను ఆదేశించారు గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో ప్రత్యేక జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 21న వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన యం.ఎస్.యం.ఈ, పి.యం. ఈ .జి.పి, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, ప్రధానమంత్రి విశ్వకర్మ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సబ్సిడీ రుణాలు, పి.యం స్వనిధి లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. అందువల్ల ఆయా పథకాల కింద 2019 నుండి దరఖాస్తు చేసుకొని మంజూరు చేయని దరఖాస్తు దారులకు రుణాలు మంజూరు చేసి చెక్కులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి అన్ని రుణాలు గ్రౌండింగ్ చేయించాలని ఆదేశించారు. ఒక్కో బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన లక్ష్యాల పై సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలు వంద శాతం పూర్తి కావాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్, నాబార్డ్ డి డి యం షణ్ముఖ చారి, సి.జి.టి.యం.ఎస్.ఈ మూర్తి, పి.డి డిఆర్డిఏ ఉమా దేవి, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. (Story :బ్యాంకు రుణాలు డిసెంబర్, 21 నాటికి వందశాతం గ్రౌండింగ్ చేయాలి)