గీతాంజలి లీడ్ స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి లీడ్ స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్ ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పట్టణ పురవీధులలో మొక్కలను చేత బూని చేసిన ప్రదర్శన చూపర్లను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి భవిష్యత్తు తరాలకు మంచిని చేకూర్చాలని అలాగే ఎవరినో చెట్లను నరకకుండా వాటిని పెంచి కాపాడాలని కోరారు. చిన్నారులు మాట్లాడుతూ. ఇప్పటికే ప్రపంచం చాలా కాలుష్యం అయిందని రాబోయే తరాలకు పరిశుభ్రమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి తమ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వెయ్యాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు వారు సొంతంగా తీసుకొంచిన మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత కై ప్రతిన బూనారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, కరాస్పాండంట్ కిషోర్, డైరెక్టర్ శేషగిరి రావు యేండ్లూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి లీడ్ స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్)