హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రతిపక్షనేతగా అనుక్షణం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో హరీష్ రావు గారిని పరామర్శించి తన సంఘీభావం తెలియజేసారు. పాడికౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తీసుకోనందుకు బాధ్యతగల ఎం.ఎల్.ఎగా పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే అతని అరెస్టు చేయడం ఏమిటి అని ఖండించి కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లిన హరీష్ రావును కనీస విలువ లేకుండా నెట్టుకుంటూ దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అసహనానికి గురై ప్రజల తరఫున నిలబడి ప్రశ్నిస్తున్న హరీష్ రావు ని,కె.టి.ఆర్ ని ఏట్లయిన అరెస్టు చేసి తను పైశాచిక ఆనందం పొందాలని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి చర్యలను తొప్పికొడతామని హెచ్చరించారు. రాష్ట్రములో తుగ్లక్ పాలన,తిరోగమన పాలన కొనసాగుతున్నదని సంక్షేమ పథకాలకు కోత విధించి,కె.సి.ఆర్ చెప్పట్టిన అభివృద్ధి పథకాలను రద్దు చేస్తూ రోజుకో అనాలోచిత ప్రకటనలు చేస్తూ మళ్ళీ వాటిని రద్దు చేస్తూ ప్రజలలో చులకన భావం పొంది రాష్ట్ర అభివృద్ధిని తిరోగమన దిశలో నడుపుతున్నారని నిరంజన్ రెడ్డి గారు దుయ్యబట్టారు. భారతదేశ రాజకీయాలలో 12నెలలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడంలో రేవంత్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఎద్దేవా చేశారు. వెంటనే అక్రమ అరెస్టు నుండి హరీష్ రావు గారిని విడుదల చేయాలని కౌశిక రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. (Story : హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి)