టీడీఆర్ బాండ్లను పారదర్శకంగా పరిశీలించండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : టీడీఆర్ బాండ్లును పారదర్శకంగా పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కమిటీ సభ్యులతో అన్నారు. స్థానిక వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో కమిషనర్ మంగళవారం టీడీఆర్ బాండ్లు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గుణదల, డోర్నకల్ రోడ్డు, ఎంజీ రోడ్ నుండి ఎన్టీఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ వరకు ఆయా ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కమిటీ ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం స్థలం లేదా నిర్మాణం కోల్పోయిన ప్రజలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు ఈ కమిటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ ద్వారా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్‌కు మాస్టర్ ప్లాన్ ద్వారా వారు ఎంత ప్రదేశం కోల్పోయారు, ఆ ప్రదేశం యొక్క మార్కెట్ విలువ ఆధారంగా కమిటీ సభ్యుల అంగీకారంతో టీడీఆర్ బాండ్లను విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల వివరాల ప్రకారం 31 టీడీఆర్ బొండ్లను, కమిటీ పరిశీలించి కమిటీ సభ్యుల అభ్యంతరాలను కమిషనర్ అడిగి తెలుసుకోవటంతో పాటు మార్కెట్ విలువను పరిశీలించారు. ఆన్‌కలైన్‌లో వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు స్వయంగా విచారించి, అభ్యంతరాలుతో పాటు అంగీకరించిన వాటిని తెలపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీ ప్రసాద్, డీసీఆర్ సృజన, ఆర్‌డీ, డీటీసీపీ శ్రీనివాస్ మూర్తి, డీటీపీపీ సునీత, తహసిల్దార్‌లు వెంకటరామయ్య, సూర్యారావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు ఆరిఫ్, రేవంత్, నందీశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్‌బాబు పాల్గొన్నారు. (Story : టీడీఆర్ బాండ్లను పారదర్శకంగా పరిశీలించండి)