అధికారులంతా సమన్వయంతో పని చేయాలి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి డ్రోన్ షోలో లోపం లేకుండా చూసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక పున్నమిఘాట్ వద్ద బబ్బూరి గ్రౌండ్స్‌లో జరగనున్న డ్రోన్ షో ఏర్పాట్లను కమిషనర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లను ప్రజల సౌకర్యార్ధాం నిర్ణయించి ప్రదేశాల్లో పెట్టడమే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణలో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని, త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి ఆదేశించారు. అధికారులంతా కలిసి కట్టుగా అవగాహనతో పనిచేస్తూ డ్రోన్ షోను విజయం చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, సీఈ శ్రీనాథ్‌రెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
కాలుష్యరహిత నగరానికి చర్యలు తీసుకోండి
కాలుష్య రహిత నగరానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వీఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం కమిషనర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా, వాడుకనీటి శుద్దిపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ న్యూఢల్లీి కన్సల్టెన్సీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా నగరంలో వాడుక నీటి శుద్ది, త్రాగునీటి సరఫరా అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులు నీటి శుద్దికి అవసరమైన చర్యలు తీసుని నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యకుమారి, ఈఈ వెంకటేశ్వరరెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.