Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన కమిషనర్‌

అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన కమిషనర్‌

0

అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన కమిషనర్‌

న్యూస్‌ తెలుగు/విజయవాడ : అక్టోబర్‌ 21న నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలతో జరిగే పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లును నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదివారం పరిశీలించారు. పార్కింగ్‌, గ్రౌండ్‌లో కార్యక్రమ ఏర్పాటు, పెరేడ్‌ మార్కింగ్‌ ట్రాక్స్‌, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లును కమిషనర్‌ పరిశీలించారు. వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవటంతో పాటు ఈ వేడుకల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా జరగాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్టేట్‌ ఆఫీసర్‌ టీ.శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామకోటేశ్వరరావు, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. (Story : అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన కమిషనర్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version