పున్నమిఘాట్ను మరింత అందంగా, పరిశుభ్రంగా ఉంచండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : పున్నమి ఘాట్‌ను మరింత అందంగా, పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 22 సాయంత్రం 6.30 గంటల నుండి పున్నమి ఘాట్ బబ్బురి గ్రౌండ్స్‌లో జరగనున్న డ్రోన్ సమ్మెట్‌లో భాగంగా డ్రోన్ షో నిర్వహణ ఏర్పాట్లను కమిషనర్ ఆదివారం పరిశీలించారు. కృష్ణానది తీరంలో పున్నమి ఘాట్ వద్ద రైలింగ్ వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను తక్షణమే తొలిగించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత ప్రాంతాల్లో త్రాగునీటి పాయింట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డీ.చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ.ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎస్‌ఈ పి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్‌ఎన్.ప్రసాద్, అమృత్ జేడీ అండ్ యూసీడీ ఇంచార్జ్ పీవో డాక్టర్ లత, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రజియా షబీనా పాల్గొన్నారు. (Story : పున్నమిఘాట్ను మరింత అందంగా, పరిశుభ్రంగా ఉంచండి)