106 సంవత్సరాల వృద్ధురాలు మృతి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య జిల్లా)
పట్టణంలోని గాండ్ల వీధిలో గల 106 సంవత్సరాలు గల సుంకర నాగమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కుమారుడు సుంకరు నారాయణ, కోడలు సుంకర పుల్లమ్మ మాట్లాడుతూ 106 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా ఇంట్లో తన పని తాను చేసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉండేదని తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండి ఆదివారం మృతి చెందిందని తెలిపారు. సుంకర నాగమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. (Story : 106 సంవత్సరాల వృద్ధురాలు మృతి)