Home వార్తలు తెలంగాణ ఆధునిక తెలుగు పాటలో గద్దర్ కు ఒక ప్రత్యేకస్థానం గద్దర్ వెన్నెల

ఆధునిక తెలుగు పాటలో గద్దర్ కు ఒక ప్రత్యేకస్థానం గద్దర్ వెన్నెల

0

ఆధునిక తెలుగు పాటలో గద్దర్ కు ఒక ప్రత్యేకస్థానం గద్దర్ వెన్నెల

గద్దర్ లాంటి కళాకారులు, సంస్కృతి ప్రదర్శన వల్లనే విప్లవం పట్ల నాకున్న నమ్మకం నానాటికి బలపడుతున్నదని శ్రీ శ్రీ మాటల్లో గద్దర్ పాటకున్న ఔన్నత్యం తేటతెల్లమవుతుంది అడవిలో వెన్నెలమ్మ ఆకుని ముద్దాడుతున్నట్టుగా గద్దర్ గొంతును పాటమ్మ ముద్దాడిందని బహుజన యుద్ధనౌక, ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె శ్రీమతి వెన్నెల అన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో గద్దర్ అన్న యాదిలో కళాకారులు, కళా సంస్థలు, మేధావులు, విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది ఈ సందర్భంగా శ్రీమతి వెన్నెల మాట్లాడుతూ గద్దర్ పాటకున్న శక్తి అంతా ఇంతా కాదని ప్రభుత్వాలనే గడగడలాడించిన చరిత్ర గద్దర్ పాటకి ఉందని అన్నారు సామాన్య పేద మధ్యతరగతి వర్గాల కోసం అనేకమైన పాటల రాస్తూ ఈ సమాజంలో తను జీవించినంత కాలం పాట కోసమే బ్రతికాడని అన్నారు ఆయన రాసిన పాటలు అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిందని అటువంటి గొప్ప వ్యక్తిని మనం మననం చేసుకోవడంలో కళాకారులు ఎప్పుడు ముందే ఉంటారని అన్నారు ఈ సందర్భంగా అనేక మంది కళాకారులు ఆటపాటలతో పౌర గ్రంథాలయములో కదం తొక్కారు గద్దర్ రాసినటువంటి అనేకమైన పాటలు ఆడి పాడి ఆలోచింపజేశారు ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ బహుజన యుద్ధనౌక గద్దరూ వారి పాట వింటే మరుగుతుంది నెత్తురు శ్రమజీవుల పాట కోసమే పుట్టిన మాస్టారు నిరంతరం పాట ప్రవాహంలా ఆలపిస్తారు అనే పాట జనాలను ఎంతో ఆలోచింపజేసింది పాటల తూట ఉదయ్ భాస్కర్ గద్దర్ పోరాట స్ఫూర్తిని గద్దర్ సాహిత్యాన్ని గద్దర్ పాటని గుర్తుచేస్తూ పాడే విధానం కంటనీరు తెప్పించాయి బానిసలారా లెండి రా.. ఈ బానిస బతుకులు వద్దురా.. అనే పాట అందర్నీ ఆకట్టుకుంది ప్రజా గాయని సత్యా మూగబోయిన గొంతులో
రాగం ఎవరు తీసేదరు జీరా బోయిన గొంతులో జీవము ఎవరి పోసేదరో అనే పాట గద్దర్ చనిపోక ముందు రాసుకున్న పాట అత్యంత అద్భుతంగా ఆలపించారు మొదట నుండి చివరి వరకు కార్యక్రమం అత్యంత రసవత్తరంగా సాగింది ఉత్తరాంధ్రకు చెందిన అనేకమంది మేధావులు ఉద్యమ సంస్థలు కళా సంస్థలు విద్యార్థినీ విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .డాక్టర్ అర్జున మాటురి శ్రీనివాస్ గంటా మోహన్ రావు సినీ దర్శకలు సత్యరెడ్డి వంగపండు దుష్యంత్ ఆవాల రమేష్ బొడ్డు కళ్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు (Story : ఆధునిక తెలుగు పాటలో గద్దర్ కు ఒక ప్రత్యేకస్థానం గద్దర్ వెన్నెల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version