ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలో సంత స్థలాన్ని తిరిగి తీసుకొని వస్తాం
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలంలో రెండు సంవత్సరాల క్రితం నుంచి సంత లొల్లి జరుగుతూనే ఉంది ఇరువురి పార్టీల మధ్య సంత గురించి చెప్పేవాళ్లే ఉన్నరు గానీ ముందుకు పోయి చేసేది ఏమీ లేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో పాల్గొని తెలియజేశారు. మాజీ మంత్రి చేసిన తప్పిదం వల్ల ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముందుకు వచ్చి సొంత భూమి మార్కెట్ చెందుతుందని మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని పాంప్లెంట్ లో పంచడం విడ్డూరంగా ఉందని 30 ఎకరాల 19 గుంటల భూమి వేణుగోపాలస్వామి ఆలయానికి చెందినదేనని ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం లేదని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని అతి త్వరలో పెబ్బేరుకు సంత ను తిరిగి తీసుకొస్తామని దీనిపై ఎవరో సృష్టించిన అపోహాలు ఎవరు నమ్మవద్దని ప్రతిపక్ష పార్టీ వాళ్లు ఏదో రాద్దాంతం చేసి సంతలో పంప్లేట్ పంచి చేసినంత మాత్రాన సంత వాళ్లకు చెంద దని దీనికి మా ఎమ్మెల్యే ప్రతినిత్యం పోరాడుతూనే ఉన్నాడని అతి త్వరలో సంతను దేవాలయం పేరు మీదకే కంపల్సరీ తీసుకొస్తాడని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, నాయకులు యుగంధర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, బోయ సత్తి, షకీల్ ,రాములు,డైరెక్టర్ రామన్ గౌడ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలో సంత స్థలాన్ని తిరిగి తీసుకొని వస్తాం)