గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న తుమ్మల సోమశేఖర్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కొత్తపేటలో ఉషోదయ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న తుమ్మల సోమశేఖర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ ఉషోదయ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారని, ఇందులో భాగంగా నాకు నాట్యంలో మంచి ప్రతిభ ఉన్నందున విద్యార్థులకు కూడా నేర్పడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే పలు సాంస్కృతిక కార్యక్రమాలలో కూచిపూడి భరతనాట్యం ప్రదర్శనలు ఇస్తూ అనేకమంది గొప్ప వ్యక్తులచే ప్రశంసలు, అభినందనలు కూడా పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన దసరా ఉత్సవాలలో అరుణాచలేశ్వరునికి నృత్యాంజలి తెలుపుతూ, నాట్యం చేసుకుంటూ, గిరి ప్రదర్శన కూడా చేయడం జరిగిందన్నారు. తదుపరి లేపాక్షి లో కూడా దసరా ఉత్సవాలలో పలు కార్యక్రమాలను నిర్వహించి అప్పటి కలెక్టర్ ద్వారా అభినందనలు కూడా పొందడం నా అదృష్టమని తెలిపారు. తదుపరి గచ్చిబౌలి స్టేడియంలో తాను గిన్నిస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రికార్డు నాట్య నృత్యాంజలికు అంకితం ఇస్తున్నానని తెలిపారు. తదుపరి పట్టణంలోని కళాకారులు, ఉషోదయ కరస్పాండెంట్ జాన్ బాషా, పాఠశాల ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది సోమశేఖర్ కు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్న తుమ్మల సోమశేఖర్)