నూతన శానిటరీ ఇన్స్పెక్టర్గా వెంకటరత్నం పదవి బాధ్యతల స్వీకరణ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మున్సిపాలిటీలో డివిజన్-1 కు నూతన శానిటరీ ఇన్స్పెక్టర్గా ఎన్ వెంకటరత్నం పదవీ బాధ్యతను స్వీకరించారు. వీరు తాడిపత్రిలో ఇన్స్పెక్టర్గా విధులు కొనసాగిస్తూ ధర్మవరం మున్సిపాలిటీకి బదిలీగా వచ్చా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్-1 ఒకటిలో గుడిసెట్ట్ కొట్టాలా, శాంతినగర్, చంద్రబాబునగర్, శారద నగర్, తిక్క స్వామి నగర్, కేశవ నగర్, సంజయ్ నగర్, శివానగర్, గుడ్డి బావి వీధి (1-9 రెవెన్యూ వార్డులు) లలో పరిశుభ్రత పట్ల తాను కృషి చేస్తారని తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయరాదని, సూచించిన చోట మాత్రమే వేయాలని తెలిపారు. అంతేకాకుండా వార్డులలో చెత్త వాహనాలు వస్తాయని, అందులో కూడా చెత్తను వేయాలని తెలిపారు. తదుపరి శానిటరీ ఇన్స్పెక్టర్కు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : నూతన శానిటరీ ఇన్స్పెక్టర్గా వెంకటరత్నం పదవి బాధ్యతల స్వీకరణ)