ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం
తెలుగుదేశం పార్టీ నాయకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణ నాయకులు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. (Story : ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం)