పట్టణ పరిశుభ్రత కొరకు అధికారులు సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉంది
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణ పరిశుభ్రతకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు వార్డులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎక్కడా రోడ్లపై చెత్త ఉండరాదని వాటిని ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రం చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. అదేవిధంగా కాలవలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరిచి మురికి నీరు రోడ్లపై రాకుండా చూడాల్సిన బాధ్యత మేస్త్రీలదేనని తెలిపారు. మురికి నీరు రోడ్డుపై పారడం వలన దుర్వాసన వస్తుందని ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని తెలిపారు. చెత్తను చెత్త వాహనంలోనే వేయాలని వారు ప్రజలకు సూచించారు. నేటి ఎన్ డి ఏ ప్రభుత్వం కూడా పరిశుభ్రత పట్ల పలు కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుందని, మన ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రంగా చూసుకోవలసిన బాధ్యత అందరిమీద ఉందని, ఇందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు శాంసన్, కేశవ తదితరులు పాల్గొన్నారు. (Story : పట్టణ పరిశుభ్రత కొరకు అధికారులు సిబ్బంది కృషి చేయాల్సిన అవసరం ఉంది)